థియేటర్లలో ప్లాప్ అవుతున్న సినిమాలు.. ఓటీటీలో సూపర్ హిట్

ఈ మధ్య ఓటీటీ సినిమాలకు మరో వేదికగా మారింది. థియేటర్లలో సినిమాకు ఓ రకమైన స్పందన వస్తే.. ఓటీటీలో మరో రకమైన టాక్ నడుస్తుంది. అర్థం కాలేదా.. అక్కడికే వస్తున్నా వినండి. థియేటర్లలో విడుదలైన సినిమా ప్లాప్ అయినా.. ఓటీటీలో మాత్రం సూపర్ హిట్ కొడుతోంది. ఇక్కడ ఫెయిలైన అంశాలను.. అక్కడ రీ ఎడిట్ చేసి రిలీజ్ చేస్తున్నారు మూవీ మేకర్స్. దీంతో ఇక్కడ ఓ లెక్క ఉంటే..అక్కడ మరో లెక్క అన్నమాట.

ఇప్పటికే చావుకబురు చల్లగా థియేటర్లలో నెగెటివ్ టాక్ ను మూటగట్టుకుంది. అయితీ దీన్ని రీ ఎడిట్ చేసి ఓటీటీలో విడుదల చేయడంతో.. అక్కడ సూపర్ హిట్ టాక్ వచ్చింది. మరి ప్రేక్షకులు మారలేదు కదా. అక్కడ ఎవరు చూశారో ఇక్కడ కూడా వారే చూస్తున్నారు కదా. అలాంటప్పుడు హిట్ టాక్ ఎలా వస్తోంది అనే కదా మీ డౌటు ఇక్కడే ఓ మ్యాజిక్ ఉంది. సినిమాల్లో బోర్ కొట్టించే సీన్ లను రీ ఎడిట్ చేసి రిలీజ్ చేస్తున్నారు. దీంతో మంచి టాక్ వస్తోంది.

ఇప్పుడు ఇదే దారిలోకి శ్రీకారం కూడా వచ్చి చేరింది. స్ఫూర్తిదాయ‌క‌మైన అంశంతో శ‌ర్వానంద్ హీరోగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా కిషోర్ రెడ్డి తీసిన ఈ సినిమా థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. కానీ సన్ ఎన్ఎక్స్ టీ అప్లికేషన్ లో భాగంగా ఓటీటీలో విడుదల చేయగా.. తక్కువ సమయంలో మిలియన్ల వ్యూస్ సంపాదించి గ‌త‌ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఇది శర్వానంద్ ఫ్యాన్స్ కు పండగే అని చెప్పాలి.