భారీ ఆఫర్ కి నో చెప్పిన శ్రీ లీల..కారణం..?

-

ప్రముఖ హీరోయిన్ శ్రీ లీల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందD అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె.. సినిమా డిజాస్టర్ గా మిగిలినా సరే ఈ సినిమాతో భారీ పాపులారిటీ దక్కించుకుంది. మరొకవైపు గత ఏడాది రవితేజ ధమాకా చిత్రంలో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె చేతిలో ఇప్పుడు ఏకంగా తొమ్మిది సినిమాలు ఉండడం గమనార్హం. ఒకవైపు యంగ్ హీరోల సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సీనియర్ హీరోల సినిమాలలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమయ్యింది.

ఇకపోతే ప్రస్తుతం ఉన్న సందర్భాలను బట్టి చూస్తే చాలామంది హీరోయిన్లు బోల్డ్ సన్నివేశాలలో నటించడానికి కూడా వెనుకాడడం లేదు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారీగా పాపులారిటీ దక్కించుకున్న శ్రీ లీలా చేత కూడా బోల్డ్ క్యారెక్టర్ లో నటింప చేయాలి అని ఒక స్టార్ డైరెక్టర్ అనుకున్నారట. అందులో భాగంగానే తాను తెరకెక్కించబోయే ఒక కొత్త ప్రాజెక్టులో ఈమెకు అవకాశం కల్పించినట్లు సమాచారం. అంతేకాదు పది కోట్ల రూపాయల వరకు పారితోషకం ఇస్తానని ఆఫర్ కూడా చేశారట.

కానీ శ్రీ లీలా మాత్రం ఈ విషయానికి ఒప్పుకోలేదని తెలుస్తోంది.. రూ.100 కోట్లు ఇచ్చినా సరే అలాంటి పాత్రలు చేయను అని ఒకవేళ అలాంటి పాత్రలు చేసే సమయం వస్తే కచ్చితంగా సినిమాల నుంచి తప్పుకుంటానని చెప్పిందట ఈ ముద్దుగుమ్మ. మొత్తానికైతే భారీ ఆఫర్ పోగొట్టుకున్నప్పటికీ కూడా తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకుంది శ్రీ లీల అంటూ నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version