DHAMAKHA : రవితేజ ”ధమాకా” సినిమాలో పెళ్లి సందడి హీరోయిన్‌

-

మాస్‌ మహారాజు వరుసగా సినిమాలు లైన్‌ లో పెట్టారు. రామారావు ఆన్‌ డ్యూటీ, ధమాకా, రావణాసుర, టైగర్‌ నాగేశ్వరరావు సినిమాలు చేస్తున్నాడు రవితేజ. అయితే.. ఇవాళ రవితేజ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలోనే..ఇటీవలే హీరో రవితేజ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ… ఆయా సినిమా నుంచి పోస్టర్లను విడుదల చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా.. రవితేజ.. తన మాస్‌ యాంగిల్‌ చూపించేందుకు ధమాకా సినిమాతో వస్తున్నారు. ఈ సినిమాకు ప్రసన్న కుమార్‌ బెజవాడ కథ, మాటలు అందిస్తున్నారు. బీమ్స్‌ సిసిరిలియో సంగీతాన్ని అందిస్తుండగా… కార్తీక్‌ ఘట్టమనేని కెమెరామెన్‌ గా వ్యవహరించనున్నారు.

అయితే.. తాజాగా థమాకా సినిమా నుంచి.. అదిరిపోయే అప్డేట్‌ ను వదిలింది. వాలంటైన్స్‌ డే నేపథ్యంలో..ధమాకా హీరోయిన్‌ ను అనౌన్స్‌ చేసింది చిత్ర బృందం. ఈ సినిమాలో.. పెళ్లి సందడి హీరోయిన్‌ శ్రీ లీలా నటిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ కూడా వదిలింది చిత్ర బృందం. ఈ అప్డేట్ తో రవితేజ ఫ్యాన్స్‌ లో నూతన ఉత్సాహం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news