త్వరితగతిన కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. ఆదివారం నంద్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అనువైన భవనాన్ని ఎంపిక చేసేందుకు ఈనెల 06న హైకోర్టు జడ్జీల బృందం కర్నూలుకు వస్తున్నట్టు మంత్రి చెప్పారు.
కర్నూలు దిన్నె దేవరపాడు వద్ద ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ కు చెందిన భవనాన్ని బృందం పరిశీలించనున్నట్టు తెలిపారు. బెంచ్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి వివరించారు.