బిగ్ బాస్ పై ఇంత ర‌చ్చ జ‌రుగుతున్న‌ శ్రీరెడ్డి నోరు పెగ‌ల్లేదే ! దానికి కార‌ణం అదేనా..?

762

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అంశానికి పునాది వేసింది శ్రీరెడ్డి. ఆ పునాదిపై బ‌ల‌మైన గొడ‌లు నిర్మించి పెద్ద సెల‌బ్రిటి అయిపోయింది. నేష‌న‌ల్ మీడియాకి ఎక్కింది. త‌ర్వాత వివాదం స‌ద్దుమ‌ణిగింది. అయినా గుర్తొచ్చిన‌ప్పుడ‌ల్లా అప్పుడ‌ప్పుడు ఎవ‌రో ఒక‌రిపై ఆరోప‌ణ‌లు చేస్తుంది. దీంతో ఆమెకి ఇదో హాబీ అని అంద‌రికీ అర్ధ‌మైంది. విష‌యం గ్ర‌హించిన‌ ఆమె ఫాలోవ‌ర్స్ శ్రీరెడ్డి ఫేస్ బుక్ పేజీని చాలా మంది బ్లాక్ చేసారు. ఇప్పుడామె ఫాలోవ‌ర్స్ దారుణంగా ప‌డిపోయారు. ఇదంతా గ‌తం. మ‌రి బిగ్ బాస్ -3పై అంత ర‌చ్చ జ‌రుగుతోన్న శ్రీరెడ్డికి నోరు ఎందుకు పెగ‌ల్లేదంటూ నేటి జ‌నులు కామెంట్లు చేస్తున్నారు. అప్పుడు అన్ని ప‌త‌తి క‌బుర్లు చెప్పినా బోల్డ్ బ్యూటీ ఇప్పుడెందుకు మౌనంగా ఉంది.

గ‌త వారం రోజులుగా బిగ్ బాస్ వివాదం సోష‌ల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్. పంచాయ‌తీ ఢిల్లీకి చేరింది. అయినా శ్రీరెడ్డి గమ్ముగా ఉంది. దీని వెనుక‌ ఆంత్య‌రం ఏంట‌ని శ్రీరెడ్డిని నేటి జ‌నులు ప్ర‌శ్నిస్తున్నారు. తాజాగా త‌న ఫేస్ బుక్ ఖాతాలో ఏవో క‌థ‌లు చెబుతానంటూ వెయిట్ లేని ఓ పోస్ట్ పెట్ట‌డంతోనే? నేటి జ‌నులు ఈ విష‌యాన్ని గుర్తు చేసుకుని ఆమెను టార్గెట్ చేసారు. అయితే ఇంకొంత మంది శ్రీరెడ్డిని బిగ్ బాస్ సీజ‌న్ 3 కి ఎంపిక చేసార‌ని అంటున్నారు. అందుకే ఆమె సైలెంట్ గా ఉంద‌ని…ఇప్పుడు ఏమాత్రం నోరు మెదిపినా బ‌య‌ట‌కు త‌ర‌మేస్తారు? అన్న భ‌యంతోనే కామ్ గా ఉంద‌ని అంటున్నారు. ఆమె వ్య‌వ‌హారం చూస్తుంటే ఈ మాట‌ల‌ను న‌మ్మ‌శ‌క్యంగానే ఉన్నాయి.

మ‌రి కామెంట్లు..రూమ‌ర్ల‌పై ఇప్ప‌టికైనా రియాక్ట్ అవుతుందేమో చూడాలి. ఈ సంద‌ర్భంగా మ‌రో విష‌యం కూడా వెలుగులోకి వ‌చ్చింది. శ్రీరెడ్డి ని యూ ట్యూబ్ లో పాపుల‌ర్ చేసింది ఓ యంగ్ యంక‌ర్. ఆ కుర్రాడు చేసిన ఇంట‌ర్వూ కార‌ణంగానే ఆమె ఫేమ‌స్ అయింది. అయితే ఆ యంగ్ యాంక‌ర్ కి ముందుగానే ప్ర‌శ్న‌ల‌న్నీ రాసిచ్చి….ఇలా అడిగితే బాగుంటుంద‌ని స‌ల‌హా ఇవ్వ‌డంతోనే అలాంటి ప్ర‌శ్న‌లు అడిగాన‌ని తెలిపాడు. త‌న కార‌ణంగానే శ్రీరెడ్డి అంత ఫేమ‌స్ అయింద‌ని..ఇప్పుడు తార‌స‌ప‌డితే బిల్డ‌ప్ ఇస్తుందని అన్నాడు.