Srikanth Iyengar apologizes to review writers: రివ్యూ రైటర్లకు టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ క్షమాపణలు చెప్పేందుకు ముందుకు వచ్చారు. బాధ కలిగించాను.. త్వరలోనే క్షమాపణ చెబుతా అంటూ వీడియో రిలీజ్ చేశారు శ్రీకాంత్ అయ్యంగార్. ‘పొట్టేల్’ మూవీ సక్సెస్ మీట్ లో రివ్యూ రైటర్స్ పై వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ క్షమాపణలు చెప్పేందుకు ముందుకు వచ్చారు. తాజాగా ఘటనపై స్పందించి ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు శ్రీకాంత్ అయ్యంగార్.
ఇక అంతకు ముందు నటుడు శ్రీకాంత్ అయ్యంగార్‌పై డిజిటల్ మీడియా జర్నలిస్ట్‌ల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. తన వ్యాఖ్యలపై శ్రీకాంత్ అయ్యంగార్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అప్పటివరకూ శ్రీకాంత్ అయ్యంగార్ నటించిన సినిమాల మీడియా కార్యక్రమాలకు హాజరు కాకూడదని నిర్ణయం తీసుకుంది. దీంతో రివ్యూ రైటర్లకు టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ క్షమాపణలు చెప్పేందుకు ముందుకు వచ్చారు.