మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు. ప్రస్తుతం మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాలో నటిస్తున్నాడు. అవా ఎంటర్టైన్ మెంట్ అండ్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ టెలివిజన్ రంగంలో సూపర్ హిట్ మహాభారత సిరీస్ ని డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు.
ఈ సినిమాలో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ తేడా లేకుండా స్టార్ హీరోలను, నటులను దింపేశాడు. అయితే మంచి విష్ణు భక్తకన్నప్ప గా, ప్రభాస్ శివుడిగా నటిస్తున్న కన్నప్ప సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయింది. మంచు విష్ణు బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ భారీ బడ్జెట్ మూవీ ప్రస్తుతం న్యూజిలాండ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. మోహన్లాల్ మరియు శివరాజ్ కుమార్ కూడా ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.