రష్మి తో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన సుదీర్..!!

-

బుల్లితెరపై స్టార్ స్టేటస్ అందుకున్న వారిలో జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుదీర్ కూడా ఒకరిని చెప్పవచ్చు. సుధీర్ బుల్లితెర నుంచి వెండితెరపై అడుగుపెట్టి ఇప్పటికి హీరోగా అనిపించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా సుధీర్ నటించిన గాలోడు సినిమా విడుదలై పర్వాలేదు అనిపించుకుంటోంది. అయితే సుధీర్, రష్మీ మధ్య ఏదో ఉందని గత కొద్ది సంవత్సరాలుగా ఎక్కువగా ప్రచారం జరుగుతూ వస్తోంది. అయితే తాజాగా సుడిగాలి సుదీర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి వాటి గురించి తెలుసుకుందాం.

సుధీర్ మాట్లాడుతూ.. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అంటే తనకు అంతగా ఇష్టం ఉండదని..సుధీర్ తెలియజేశారు. నేను రష్మి ఒకరినొకరు పట్టుకోమని, ముట్టుకోమని ఆ రీజన్ వల్లే మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని సుడిగాలి సుదీర్ తెలియజేశారు. నేను రష్మీ కళ్ళలో మా మనసులోని ఎక్స్ప్రెస్ బయటపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటామని తెలిపారు సుడిగాలి సుదీర్. ఆన్ స్క్రీన్ మీద నాకు రొమాన్స్ ఇష్టం ఉండదని అయితే నేను డైరెక్టర్కు నో చెప్పే స్థాయిలో లేనని తెలియజేశారు సుదీర్.

ఒకవేళ తన రేంజ్ మారిపోతే తనకు నచ్చని సన్నివేశాలను వద్దని చచెప్పే సూచన ఇస్తానని తెలియజేశారు. తనకు పెళ్లి అంటే ఇష్టం లేదని.. పెళ్లి చేసుకోనని సుధీర్ తెలియజేయడం జరిగింది. దీంతో సుధీర్ రష్మి తో పరోక్షంగానే వివాహం జరగదనే విషయాన్ని క్లారిటీ ఇవ్వడం జరిగింది. సుధీర్ వెల్లడించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక కేవలం తన ఫోకస్ మొత్తం తన తదుపరి ప్రాజెక్టులపైనే ఉన్నట్లుగా తెలియజేశారు. మరి రాబోయే రోజుల్లో నైనా సుధీర్ మంచి విజయాలను అందుకుంటారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version