‘సెల్ఫిష్’ అయిపోయిన సుకుమార్..

-

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ‘పుష్ప: పార్ట్ వన్: ది రైజ్’తో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయారు. ఈ సినిమా చూసి బాలీవుడ్ సెలబ్రిటీలు ఫిదా అయిపోయారు. స్టార్ హీరోలు, డైరెక్టర్స్ సుకుమార్ టేకింగ్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

దర్శకుడు సుకుమార్ ఒక వైపున దర్శకుడిగా సినిమాలు చేస్తూనే మరో వైపున నిర్మాతగానూ సినిమాలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై ఇప్పటికే ‘ఉప్పెన’ సినిమా అందించిన సుక్కు…‘సెల్ఫిష్’ చిత్రానికి సహకారం అందిస్తున్నారు.

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ హీరో ఆశిష్..‘సెల్ఫిష్’ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ‘రౌడీ బాయ్స్’ పిక్చర్ తో ప్రేక్షకుల మెప్పు పొందిన ఆశిష్..రెండో సినిమా ‘సెల్ఫిష్’కు విశాల్ కాశీ దర్శకత్వం వహిస్తున్నాడు.

యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమాకు ఆశిష్ కంప్లీట్ మేకోవర్ చేంజ్ చేశాడు. ఈ చిత్రానికి డైలాగ్స్, స్టోరితో పాటు ఇతర ఇన్ పుట్స్ ఇచ్చేందుకు సుకుమార్ ఒప్పుకున్నాడు. ఈ సందర్భంగా ఆశిష్..సుకుమార్ కు సోషల్ మీడియా వేదికగా థాంక్స్ చెప్పాడు. మిక్కీ జే మేయర్ ఈ ఫిల్మ్ కు మ్యూజిక్ అందిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news