ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన కొనసాగుతోంది. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా మూడోరోజు వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశం అయ్యారు. తాజాగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించారు.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఐటీ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు చంద్రబాబు. ఏపీలో ఏర్పాటు చేయబోతున్న వరల్డ్ క్లాస్ ఏఐ యూనివర్సిటీ సలహా మండలిలో భాగస్వామ్యం వహించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు బిల్ గేట్స్. అదేవిధంగా యునీలీవర్, డీపీ వరల్డ్ గ్రూపు, పెట్రోలియం నేషనల్ బెర్హాద్ (పెట్రోనాస్), గూగుల్ క్లౌడ్, పెప్సీకో, ఆస్ట్రోజెనెకా సంస్థల సీఈఓలతోనూ సీఎం సమావేశం అయ్యారు.