కేటీఆర్ ఐటీ ఎంప్లాయ్ కాబట్టి ఎంప్లాయ్ మైండ్‌సెట్‌తో ఆలోచిస్తాడు.. “నేను పొలిటీషియన్‌ని, పాలసీ మేకర్‌ని.. నాకు అన్ని తెలవాల్సిన అవసరం లేదు” అని దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన పై కూడా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్నారు.
దావోస్ లో ప్రపంచ ఆర్థిక ఫోరం, సీఐఐ, హీరో మోటార్ కార్ఫ్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో హైదరాబాద్ ను అభివృద్ధి చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ ను ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన పర్యావరన అనుకూల నగరంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి రావాలన్నారు. రాష్ట్రంలోని నాలుగు కోట్ల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు సహకరించాలని పారిశ్రామికవేత్తలను సీఎం ఆహ్వానించారు. రాష్ట్ర ప్రజలు తక్కువ ఖర్చుతో వేగంగా ప్రయాణించాలనేది ప్రభుత్వ ఆకాంక్ష అన్నారు.