అల్లు అర్జున్‌ని ఎందుకు అరెస్ట్ చేశామో చంద్రబాబు నాయుడుకు తెలియదు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

పుష్ప-2 ప్రీమియర్స్ షో సందర్భంగా అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్దకు చేరుకోవడం.. తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళా మరణించింది. ఆమె కుమారుడు తేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ అరెస్ట్ కావడం.. బెయిల్ రావడం జరిగింది. పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్న విషయం విధితమే.

CM Revanth Reddy

తాజాగా దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఓ మీడియా ప్రతినిధి ఇలా ప్రశ్నించాడు. అల్లు అర్జున్‌ని అరెస్ట్ చెయ్యడం మంచిది కాదని చంద్రబాబు నాయిడు అన్నారు. దీనిపై మీరేమంటారు సార్ అని ప్రశ్నించగా.. సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. అల్లు అర్జున్‌ని ఎందుకు అరెస్ట్ చేసామో చంద్రబాబు నాయుడుకు తెలియదు. మొత్తం తెలుసుకొని మాట్లాడాలి. తొక్కిసలాటలో మహిళ చనిపోతే, అల్లు అర్జున్ 10-12 రోజులు వాళ్ళ ఫ్యామిలీని పట్టించుకోలేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది అని దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Latest news