రజనీకాంత్, వెంకటేశ్, పవన్ కల్యాణ్ లకు ఛాలెంజ్ విసిరిన సూపర్ స్టార్ కృష్ణ..!

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ క్రమంగా సినిమా పరిశ్రమలో విస్తరిస్తోంది. టీఆర్ ఎస్ ఎంపీ సంతోష్ విసిరినా సవాల్ ని స్వీకరిస్తూ తమ వంతుగా మొక్కని నాటుతూ సాటి నటులకు హరిత సవాల్ విసురుతున్నారు… తాజాగా సూపర్ స్టార్ కృష్ణ కూడా గ్రీన్ ఛాలెంజ్‌లో ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, విక్టరీ వెంకటేశ్ లకు కూడా అదే ఛాలెంజ్ ను విసిరాడు.

అలాగే ప్రతి ఒక్కరు మొక్కలని నాటలని,ఈ కార్యక్రమం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు అయన తెలిపారు. కాగా, ఈ ఛాలెంజ్ లో భాగంగా కృష్ణ తన ఇంటి ప్రాంగణంలో మూడు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సంతోష్ కుమార్, సినీ నటుడు కాదంబరి కిరణ్ కూడా పాల్గొన్నారు.