సూపర్ స్టార్ లేటెస్ట్ సినిమా ” అన్నాథే ” రిలీజ్ డేట్ ఫిక్స్ ..!

-

సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో మంచి దూకుడు మీదున్నారు. 2020 ప్రారంభంలోనే రజనీకాంత్ హీరోగా దర్బార్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత తలైవర్ దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్‌టైనర లో నటిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమాని ప్రారంభించారు. అంతేకాదు “అన్నాథే” అనే టైటిల్ ని ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్ టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు.

 

ఇక ఇప్పటి వరకు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తో వీరం, వేదాళం, వివేకం, విశ్వాసం సినిమాలు తీసి నాన్ స్టాప్ హిట్స్ అందించాడు. మంచి కమర్షీయల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తున్న శివ సినిమాలు కోలీవుడ్ లో భారీగా వసూళ్ళని సాధిస్తున్నాయి. ఇక శివ ప్రస్తుతం రజినీకాంత్ తో తీస్తున్న అన్నాథే సినిమాని కూడా ఒక మంచి పవర్ఫుల్ మాస్ సబ్జెక్ట్ తో తెరకెక్కిస్తున్నాడు. నయనతార, కీర్తి సురేష్ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, సూరి, ఖుష్బూ, మీనా తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమాని 2021వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నట్లు కాసేపటి క్రితం తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వెల్లడించారు సన్ పిక్చర్స్ సంస్థ. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటన రాగానే రజిని ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మొతానికి రజనీకాంత్ ఈ సినిమాతో భారీ సక్సస్ ని అందుకోబోతున్నారని కోలీవుడ్ మీడియాలో టాక్ నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news