అఖిల్ కోసం సురేంద‌ర్‌రెడ్డి భారీ స్కెచ్‌.. హిట్ కోసం ఏకంగా!

స్టార్ హీరో రేంజ్‌కి ఏ మాత్రం తీసిపోకుండా ఉంటాయి అఖిల్ అక్కినేని సినిమాలు. ఆయ‌న ఇండ‌స్ట్రీకి ఓ స్టార్ హీరో అంచ‌నాల‌తోనే వ‌చ్చారు. అయితే మ‌నోడికి అదృష్టం కాస్త క‌లిసి రాలేద‌నే చెప్పాలి. ఇప్ప‌టికే ఈ హీరో చేసిన మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయి. అయినా మ‌నోడు ఎక్క‌డా త‌గ్గ‌కుండా పెద్ద డైరెక్ట‌ర్ల‌తోనే సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు మ‌రో భారీ ప్లాన్ వేశాడు.

 

ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాల‌ని చూస్తున్నాడు ఈ హీరో. ఇప్పుడు అఖిల్ ఆశలన్నీ ఆయ‌న నటించిన మోస్ట్ ఎలిజిబుల్ సినిమా పైనే ఉన్నాయి. బొమ్మరిల్లు డైరెక్ట‌ర్ భాస్కర్ ఈ సినిఆకు దర్శకత్వం వహించ‌గా.. పూజా హెగ్డే హీరోయిన్‏గా చేసింది.

ఇదిలా ఉండ‌గా ఆయ‌న ఇప్పుడు స్టార్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్‌రెడ్డి దర్శ‌క‌త్వంలో ఏజెంట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అఖిల్ సరికొత్త లుక్ లో క‌నిపిస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమా కోసం ఓ సూప‌ర్ స్టార్‌ను తీసుకొస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఓ కీలక పాత్ర కోసం ఏకంగా కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రను తీసుకోవాలని డైరెక్ట‌ర్ భావిస్తున్నాడంట‌. మ‌రి ఉపేంద్ర ఒప్పుకుంటాడా లేదా అనేది చూడాలి.