సురేష్ బాబు తేల్చిపారేశారుగా …?

-

ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న కొన్నిసినిమాలు చిత్రీకరణ దశలో ఉన్న సంగతి తెలిసిందే. తమిళ్ సూపర్ హిట్ ‘అసురన్’ కి రీమేక్ గా రూపొందుతున్న ‘నారప్ప’. క్లాస్ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మొదటిసారి ఈ మాస్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో వెంకటేష్ – ప్రియమణి జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే చాలావరకు టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. అయితే మిగతా టాకీ పార్ట్ అండ్ సాంగ్స్ కోసం ఇప్పట్లో సెట్స్ కి వెళ్ళే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు.

 

ఇక రానా – గుణశేఖర్ కాంబినేషన్ లో తెరకెక్కించాలనుకున్న ‘హిరణ్య కశ్యప’.. ‘సోను కే టిటు కి స్వీటీ’ ‘డ్రీమ్ గర్ల్’ సినిమాలు కూడా పరిస్థితులన్ని సాధారణ స్థితికి చేరుకున్నాకే పట్టాలెక్కించాలని సురేష్ బాబు అనుకుంటున్నారట. సురేష్ బాబు తీసుకున్న ఈ నిర్ణయాన్ని చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. కమర్షియల్ గా ఆలోచించకుండా మానవతా దృక్పథంతో ఆలోచిస్తున్నందుకు అందరూ మెచ్చుకుంటున్నారట.

 

ఇక గతేడాది ‘ఓ బేబీ’ ‘వెంకీమామ’ సినిమాలని రూపొందించి మంచి కమర్షియల్ సక్సస్ లను అందుకున్న సురేష్ ప్రొడక్షన్స్ లో ‘నారప్ప’ కూడా భారీ సక్సస్ ని అందుకోబోతుందన్న ధిమాతో ఉన్నారు. ఇక సురేష్ బాబు తనయుడి రానా దగ్గుబాటి వివాహం ఆగస్టులో జరపబోతున్నట్టు గత కొన్ని రోజులు గా వార్తలు వస్తుండగా ఇంకా అధికారకంగా సురేష్ బాబు ప్రకటించలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version