సినిమానే రిలీజ్ కాలేదు అప్పుడే రీమేకా..?

-

దక్షిణాది సినిమాలకి బాలీవుడ్ లో గిరాకీ బాగా పెరిగింది. గత కొన్ని రోజులుగా చూసుకుంటే ఈ ట్రెండ్ మరీ ఎక్కువగా కనిపిస్తుంది. ఐతే రిలీజై హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రాలని రీమేక్ చేయడం చాలా మామూలే. కానీ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే రీమేక్ గురించి చర్చలు రావడమే ఆసక్తికరంగా ఉంది. తమిళ నటుడు సూర్య హీరోగా నటించిన ఆకాశం నీ హద్దురా చిత్రానికి రెస్పాన్స్ ఈ విధంగానే ఉంది. తెలుగు దర్శకురాలు సుధ కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమాకి బాలీవుడ్ నుండి రీమేక్ ఆఫర్స్ వస్తున్నాయట.

ఇటీవల విడుదలైన ట్రైలర్ కి విశేష స్పందన రావడం, అంతకుముందు రిలీజ్ చేసిన పాటలు అందరినీ ఆకట్టుకోవడంతో ఆకాశం నీ హద్దురా చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బాలీవుడ్ లో మంచి ఆదరణ దక్కించుకుంటుందన్న కారణంగా అప్పుడే రీమేక్ కి ప్లాన్ చేస్తున్నారట. ఐతే ఈ రీమేక్ కి కూడా సుధ కొంగరనే దర్శకత్వం వహిస్తారని టాక్. మరి బాలీవుడ్ నిర్మాతలు అంత నమ్మకం పెట్టుకున్న ఈ సినిమా ఎంతమేర మెప్పిస్తుందో తెలుసుకోవాలంటే నవంబర్ 12వరకూ ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news