ఆచార్య విష‌యంలో త్వ‌ర‌లోనే స‌ర్‌ప్రైజ్‌.. కొర‌టాల‌కు మెగాస్టార్ ఆర్డ‌ర్‌!

చిరంజీవి, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఆచార్య‌పై ఓ రేంజ్‌లో అంచ‌నాలున్నాయి. ఇందుకు కొర‌టాల చేసిన ప్ర‌తి సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కావ‌డ‌మే ప్ర‌ధాన కార‌ణం. పైగా ఇందులో రామ్‌చ‌ర‌ణ్ కూడా న‌టిస్తుండ‌టంతో అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ మొద‌ల‌యిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టికే చాలాసార్లు వాయిదా ప‌డింది.

ఇక ఈ కార‌ణాల‌తో సినిమా రిలీజ్ డేట్‌ను కూడా వాయిదా వేశారు మేక‌ర్స్‌. అయితే ఇప్పుడు అభిమానులకు మెగాస్టార్ ఒక గుడ్ న్యూస్ చెప్పేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ రూల్స్ మెల్ల‌మెల్ల‌గా రిలాక్స్ కావ‌డంతో.. ఆచార్య‘ షూటింగ్ మ‌ళ్లీ కంటిన్యూ చేయాల‌ని కొరటాలకు చిరు సూచించిన‌ట్టు తెలుస్తోంది.

ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్త‌యింది. కేవలం 15 రోజుల షూటింగ్ మాత్ర‌మే మిగిలి ఉండ‌టంతో, అది కూడా రామ్ చరణ్ కు సంబంధించిన సీన్స్ మాత్ర‌మే ఉన్న‌ట్టు తెలుస్తోది. ఇక దీన్ని తొందరగా పూర్తి చేసి, రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాల‌ని చిరు భావిస్తున్నారంట‌. ఇక కొరటాల కూడా ఈ క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ మిగ‌తా షూటింగ్ పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారంట‌. చూడాలి మ‌రి దీని అనౌన్స్ మెంట్ ఎప్పుడో.