పెళ్లైనా పట్టింపులేం లేవు..!

-

సిల్వర్ స్క్రీన్స్ పై హీరోయిన్స్ కు పెళ్లికి ముందుదాకా ఒక ఇమేజ్ ఉంటుంది. పెళ్లి తర్వాత ఎంతైనా కాస్త క్రేజ్ తగ్గే అవకాశం ఉంటుంది. ఈ వ్యత్యాసం హీరోయిన్స్ కు తెలుసు. పెళ్లి తర్వాత స్టార్ క్రేజ్ కొనసాగించిన భామలు చాలా తక్కువ మంది ఉన్నారు. తెలుగులో అయితే ప్రస్తుతం సమంత పెళ్లి తర్వాత కూడా సక్సెస్ అందుకుంటూ వరుస ఆఫర్స్ తెచ్చుకుంటుంది.

ఇక ఈ జాబితాలో కలర్స్ స్వాతి కూడా చేరుతుందని అంటున్నారు. యాంకర్ గా కెరియర్ ఆరంభించి హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పై కూడా తన టాలెంట్ చూపించిన కలర్స్ స్వాతి ఈమధ్యనే పైలెట్ ను పెళ్లాడింది. పెళ్లి తర్వాత సినిమాల్లో కొనసాగుతా అని చెప్పినా అదేదో ఫ్లోలో అనేసింది అనుకున్నాం. కాని కలర్స్ స్వాతి నిజంగానే సినిమాలు చేస్తుందట. పెళ్లికి ముందు గ్లామర్ షోకి కాస్త దూరంగా ఉంటూ వచ్చిన స్వాతి ఇప్పుడు వాటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందట.

ఎవరైనా పెళ్లి తర్వాత గ్లామర్ షోలకు ఫుల్ స్టాప్ పెడతారు కాని స్వాతి దానికి రివర్స్ గా పెళ్లికి ముందు పద్ధతైన పాత్రలు చేసి పెళ్లి తర్వాత రెచ్చిపోతా అంటుంది. మరి స్వాతి లో ఈ కొత్త వర్షన్ ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version