బిగ్ బాస్-3 పంచాయితీ ముదురుతోంది. తెలంగాణ హైకోర్టులో నిర్వాహకులకు ఊరట దొరికినా ఆరోపణలపై వివరణ ఇవ్వక తప్పదు. దీంతో శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా వివాదాన్నిమరింత సీరియస్ గా తీసుకున్నారు. కేతిరెడ్డి, ఓయూవిద్యార్ధుల సైతం సీన్ లోకి ఎంటర్ అవ్వడంతో రోజురోజుకి వివాదం బలపడుతోంది. తాజాగా పంచాయితీ ఢిల్లీకి చేరింది. ప్రసారాన్ని నిలిపివేయాలంటూ జాతీయ మహిళా హక్కుల కమీషన్ ను ఆశ్రయించారు. రియాల్టీ షో పేరుతో మహిళను వంచిస్తున్నారని, షో ప్రసారం నిలిపివేయాలంటూ ఫిర్యాదు చేసారు. దానికి సంబంధించి ఓ వీడియు కూడా రిలీజ్ చేసారు. ఫిర్యాదును మహిళాహక్కుల కమీషన్ స్వీకరించింది. ఓయూవిద్యార్ధి సంఘం కూడా ఇదే విషయాన్ని హెచ్ ఆర్ సీ దృష్టికి తీసుకెళ్లారు.
ఒకవేళ షో కొనసాగించాలంటే అసభ్యకరమైన సన్నివేశాలు లేవని నిరూపించిన తర్వాతే టెలికాస్ట్ చేయాలని కోరారు. కానీ పక్షంలో ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చుతుందని హెచ్చరించారు. హెచ్ ఆర్ సీ ఫిర్యాదును స్వీకరించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. అదే జరిగితే షో ఆగిపోవడం ఖాయం. ప్రభుత్వం వెంటనే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసే అవకాశం ఉంది. తెలంగాణ హైకోర్టులో కూడా వివాదంపై చర్చ జరుగుతోంది వివాదం మరిత జఠిలం చాన్స్ ఉంది. ఇప్పటికే టాలీవుడ్ లో లైంగిక వేధింపులు ఉన్నాయని శ్రీరెడ్డి హెచ్ ఆర్ సీని ఆశ్రయించడంతో టీ గవర్నమెంట్ కొందరు ప్రభుఖుల ఆధ్వర్యంలో ఓ కమిటీ వేసింది. నిజా నిజాలు తేల్చే పని కొనసాగుతోంది.
తాజా ఆరోపణల నేపథ్యంలో కేంద్రం విషయాన్ని సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది. ఈ వివాదం ఇక్కడితో సమసిపోయేది కాదు. మొత్తం అన్ని భాషలకు ఈ సెగ తగిలే అవకాశాలున్నాయి. బాలీవుడ్ లో బిగ్ బాస్ షో ఎప్పుడో నుంచో టెలికాస్ట్ అవుతోంది. చిలవఫలవులగా అక్కడా ఈ తరహా ఆరోపణలున్నాయి. సౌత్ లో తమిళనాడు. తెలంగాణ రాష్ర్టాల్లో రెండు సీజన్లు పూర్తయ్యాయి. మూడవ సీజన్ కు రంగం సిద్ధం అవుతోన్న నేపథ్యంలో లైంగిక ఆరోపణలు వెల్లువెత్తాయి కాబట్టి అన్ని భాషల బిగ్ బాస్ పైనే హెచ్ ఆర్సీ దృష్టి పెట్టే అవకాశంఉంది. అదే జరిగితే బిగ్ బాస్ కి నష్టం భారీగానే ఉంటుంది. అసలే మీటూ ఉద్యమంతో మొన్నటివరకూ దేశం అట్టుడికిన సంగతి తెలిసిందే.