సైరా తొలి రోజు వసూళ్లతోనే మెగాస్టార్ విశ్వరూపం చూపించేశాడు. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుంటే రు. 38.73 కోట్ల షేర్ రాబట్టింది. ఓవరాల్‌గా ఇప్పటివరకు టాప్‌లో ఉన్న బాహుబలి 2 రు. 42.76 కోట్లతో తన టాప్ ప్లేస్ కంటిన్యూ చేసుకుంది. ఆ సినిమా తర్వాత సైరా రెండో స్థానంలోకి దూసుకు వచ్చేసింది. దాదాపు అన్ని ఏరియాల్లోనూ బాహుబులి 2కు దగ్గర్లోకి వచ్చేసింది.
కొన్ని చోట్ల బాహుబలి 1, సాహోలను క్రాస్ చేసింది. ఇక ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు ‘సైరా’ నైజాం మొదటిరోజు కలెక్షన్స్ అల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన సినిమాల జాబితాలో మూడో స్థానంలో నిలిచినట్టు తెలుస్తోంది. తొలిరోజు ఈ చిత్రం రూ.8.10 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ‘సాహో’ రూ.9.41 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా ‘బాహుబలి-2’ రూ.8.9 కోట్లతో రెండవ స్థానంలో ఉంది.
సైరా ఫస్ట్ డే ఏరియా వైజ్ షేర్ (రు.కోట్లలో ) :
నైజాం – 8.10
సీడెడ్ – 5.90
నెల్లూరు – 2.09
కృష్ణా – 3.03
గుంటూరు – 5.06
వైజాగ్ – 4.72
ఈస్ట్ – 5.34
వెస్ట్ – 4.50
—————————————
ఏపీ + తెలంగాణ = 38.73 కోట్లు
—————————————
ఓవరాల్‌గా ఆల్ టైం సెకండ్ రికార్డ్… ఫస్ట్ బాహుబలి 2 = 42.76 కోట్లు