ఒక్క ఫైటే 45 కోట్లు.. సైరా సంచలనం..!

-

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా రాబోతున్న సైరా నరసింహా రెడ్డి సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను రాం చరణ్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఓ ఫైట్ సీన్ కోసం ఏకంగా 45 కోట్ల దాకా బడ్జెట్ కేటాయించారట. ఈ ఫైట్ సీన్ సినిమాకే హైలెట్ గా ఉంటుందని అంటున్నారు. హాలీవుడ్ యాక్షన్ మాస్టర్ కంపోజ్ చేస్తున్న ఫైట్స్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాయని చెబుతున్నారు.

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి సినిమా బయోపిక్ గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి. ఒక్క ఫైటే 45 కోట్లంటే సైరా సినిమా ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఈమధ్య రిలీజైన టీజర్ సినిమాపై మరింత హైప్ వచ్చేలా చేసింది. తెలుగు పరిశ్రమ నుండి రాబోతున్న మరో బాహుబలి సినిమాగా సైరాని ప్రమోట్ చేస్తున్నారు.

2019 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు లాంటి స్టార్స్ ఇందులో భాగమవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version