Tabu: నాగర్జున ఫోటోపై సీనియర్ హీరోయిన్ హాట్ కామెంట్స్?

-

 

Tabu: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఒకప్పటి స్టార్ హీరోయిన్ టబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు స్టార్ హీరోలు అందరి సరసన నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది.

tabu comments on nagarjuna

ఇక ఈ బ్యూటీ బాలీవుడ్ లోనూ నటిస్తూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. అక్కడ వచ్చిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మంచి క్రేజ్ ని తెచ్చుకుంది. ఇక కొన్ని రోజులపాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన టబు అలా వైకుంఠపురం సినిమాతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. ఈ భామకి 52 ఏళ్ళు వచ్చినప్పటికీ ఇంకా వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉంటుంది.

ఇది ఇలా ఉండగా తాజాగా… అక్కినేని నాగార్జున ఫోటో పై షాకింగ్ కామెంట్స్ చేసింది టబు. మొన్న ఫాదర్స్ డే రోజు నాగచైతన్య షేర్ చేసిన ఫోటోపై టబూ స్పందించారు. మూడు రెడ్ హాట్ ఎమోజీలను కూడా షేర్ చేశారు టబు. ప్రస్తుతం టబూ హాట్ సింబల్స్ షేర్ చేయడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. కాగా… అక్కినేని నాగార్జున అలాగే టబూ ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా నాగర్జున, టబు పెళ్లి చేసుకుంటారని కూడా కొంతమంది ప్రచారం చేశారు. ఆ వార్తలకు చెక్ పెడుతూ అమలను వివాహం చేసుకున్నాడు అక్కినేని నాగార్జున.

Read more RELATED
Recommended to you

Latest news