‘కల్కి’లో విజయ్ దేవరకొండ, దుల్కర్.. ఈ హైలైట్ సీన్స్ చూశారా?

-

‘కల్కి 2898 ఏడీ’ సినిమా థియేటర్లలో రిలీజై బ్లాక్ బస్టర్ టాక్తో అదరగొడుతోంది. యూఎస్ఏ ప్రీమియర్స్, తొలి షో నుంచే పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఇక ఈ సినిమా టికెట్ బుకింగ్స్ ఏ రేంజ్లో రికార్డు సృష్టించిందో తెలిసిందే. విడుదలై 24 గంటలు కూడా గడవకముందే ఈ మూవీ బాక్సాఫీస్ను షేక్ చేసేలా కనిపిస్తోంది మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రాణం పోసిందంటూ ప్రభాస్ ఫ్యాన్స్ చెబుతున్నారు.

ఈ సినిమా స్టోరీ ఒకత్తైతే.. ఇందులో నటులు, వారి నటన మరొక ఎత్తు. ప్రతిఒక్కరి నటన అద్భుతంగా ఉందంటూ ఆడియెన్స్ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియా మొత్తం కల్కి చర్చే. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ గురించి కూడా తెగ చర్చించుకుంటున్నారు. ఆయనకు సంబంధించిన వీడియోలను తెగ షేర్ చేస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, దర్శకధీరుడు రాజమౌళి ఉన్నట్లు వార్తలొచ్చాయి. ప్రచారం సాగినట్టుగానే వీరంతా సినిమాలో ఆయా పాత్రల్లో తళుకున్న మెరిశారు.

Read more RELATED
Recommended to you

Latest news