Odela 2 Trailer : తమన్నా ‘ఓదెల 2’ ట్రైల‌ర్ రిలీజ్

-

అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక వంటి సప్త మోక్షపురిలలో సాధన చేసిన దాంతో సవాల్ వద్దురా సైతాన్ అంటూ టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా విలన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఆమె ప్రధాన పాత్రలో న‌టిస్తున్న తాజా చిత్రం ఓదెల 2. 2021లో విడుదలైన “ఓదెల రైల్వే స్టేషన్” సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది.  సూపర్‌ నాచురల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఓదెల-2 ట్రైలర్ రిలీజ్ చేశారు. ఫస్ట్ పార్ట్ కొనసాగింపుతో ఈ సినిమా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే తెలిసిపోతోంది. దైవ శక్తికి, దుష్టశక్తికి మధ్య జరిగే పోరాటమే ఈ చిత్రమని వీడియో చూస్తే అర్థమవుతోంది. ఇందులో తమన్నా భాటియా నాగసాధువు భైరవి పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకు టాలీవుడ్ ద‌ర్శ‌కుడు సంపత్‌ నంది కథను అందించారు. అశోక్‌ తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్‌లపై డి. మధు నిర్మించారు.

Read more RELATED
Recommended to you

Latest news