‘గాన కోకిల’ పి సుశీలకు డాక్టరేట్ ప్రదానం

-

గాన కోకిల పి సుశీల గురించి తెలియని వారుండరూ. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ ఇలా ఎన్నో భాషల్లో తన మధురమైన గాత్రంతో దశాబ్దాల నుంచి ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. తన కెరీర్​లో 50 వేలకు పైగా పాటలు పాడిన సుశీల ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నారు. తాజాగా సుశీలను అరుదైన గౌరవం వరించింది. చెన్నైలోని తమిళనాడు డాక్టర్ జే జయలలిత సంగీత విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేట్ అందజేసింది. ఈ యూనివర్సిటీ రెండో స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తమిళనాడు ముఖ్యమంత్రి కె స్టాలిన్.. సుశీల, సంగీత దర్శకుడు పీఎమ్​ సుందరంతో పాటు విద్యార్థులు అవార్డులు ప్రదానం చేశారు.

గాయని పి సుశీల గాత్రానికి మంత్రముగ్దులు కాని వారు ఉండరని.. అందులో తాను ఒకడినని సీఎం స్టాలిన్ అన్నారు. తన కారు ప్రయాణాల్లో సుశీల పాటలే ఎక్కువగా వింటానని చెప్పారు. ఆమె పాడిన పాటల్లో తనకు ఎక్కువగా ఇష్టమైన పాట ‘నీ ఇల్లత ఉలగత్తిల్ నిమ్మత్తి ఇల్లై’ ‘ అని తెలిపారు. ఇప్పటివరకు సుశీల ఐదు జాతీయ అవార్డులు అందుకున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news