‘తమిళ్‌ రాకర్స్‌’ పైరసీ మూవీస్ అడ్మిన్‌ అరెస్టు

-

‘తమిళ్‌ రాకర్స్‌’ గురించి తెలియని వారుండరు. ముఖ్యంగా సినీ ప్రియులకు ఈ గ్రూప్ గురించి బాగా తెలుసు. కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలను పైరసీ చేసి వెబ్ సైట్లో వదులుతూ పోలీసులకే సవాళ్లు విసురుతుంది ఈ గ్రూప్. అయితే తాజాగా ఈ పైరసి గ్రూప్‌ అడ్మిన్‌ని కేరళలో పోలీసులు అరెస్టు చేశారు. మదురైకి చెందిన జెఫ్‌ స్టీఫన్‌రాజ్‌… థియేటర్లలతో కొత్తగా విడుదలయ్యే సినిమాలను పైరసీ చేసి అక్రమంగా వెబ్‌సైట్‌ల్లో విడుదల చేస్తున్న ‘తమిళ్‌ రాకర్స్‌’ అడ్మిన్‌.

తాజాగా అతడు కేరళ తిరువనంతపురంలోని థియేటర్‌లో నటుడు ధనుష్‌ ‘రాయన్‌’ సినిమాను సెల్‌ఫోన్‌లో రికార్డు చేస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం అతన్ని అరెస్టు చేశారు. పోలీసుల దర్యాప్తులో 12 మంది కలిసి పనిచేస్తున్నట్లు తెలిసింది. నటుడు పృథ్వీరాజ్‌ నటించిన ‘గురువాయూర్‌ అంబలనడైయిల్‌’ అనే మలయాళ సినిమా గత మే నెలలో విడుదలవగా మొదటి రోజే తమిళ్‌ రాకర్స్‌ వెబ్‌సైట్‌లో పెట్టిన విషయం తెలిసిందే. తమిళ్‌ రాకర్స్‌ వెబ్‌సైట్‌ మాత్రమే కాకుండా టెలిగ్రామ్‌లో కూడా అతను సినిమాలను విడుదల చేస్తున్నట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version