యాంకర్ నోటి దురుసు.. ఒలింపిక్స్‌ విధుల నుంచి ఔట్

-

ప్రముఖ యాంకర్ బాబ్‌ బల్లర్డ్‌ను పారిస్‌ ఒలింపిక్స్‌ విధుల నుంచి యూరో స్పోర్ట్‌ తొలగించింది. ఆస్ట్రేలియా మహిళా స్మిమ్మర్లు ఆదివారం 4×100 ఫ్రీస్టైల్‌ రిలేలో స్వర్ణం సాధించిన సందర్భంగా వారి గెలుపును ప్రకటిస్తూ బాబ్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో సోషల్‌ మీడియాలో తీవ్ర దుమారానికి దారి తీశాయి. బాబ్ సహ వ్యాఖ్యాత లిజ్జీ సైమండ్స్ సైతం ఆయన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని పేర్కొన్నారు.

దీనిపై స్పందించిన యూరోస్పోర్ట్‌ యాజమాన్యం.. కామెంటరీలో బల్లర్డ్‌ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ధ్రువీకరిస్తూ.. విధుల నుంచి వెంటనే తొలగిస్తున్నట్లు ప్రకటించింది. స్మిమ్మింగ్‌లో 4x100m ఫ్రీస్టైల్ రిలేను 3: 28: 92 నిమిషాల్లో పూర్తి చేసిన ఆస్ట్రేలియా మహళల బృందం బంగారు పతకాన్ని కైసం చేసుకుంది. ఈ ఈవెంట్‌లో తొలి స్థానంలో నిలవడం ఆస్ట్రేలియాకు ఇది వరుసగా నాలుగోసారి. . అమెరికా, చైనా తర్వాత స్థానాల్లో నిలిచాయి. మరోవైపు పారిస్‌ ఒలింపిక్స్‌లో ఈ సారి పురుషులు, మహిళల క్రీడాకారుల సంఖ్య సమానంగా ఉండడం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version