పవన్ ఆలి ఇద్దరూ మంచివాళ్లు.. ఇలా రోడ్లెక్కి గొడవపడడం బాగాలేదు.. తమ్మారెడ్డి భరధ్వాజ్ ఏకేశాడుగా..!

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కమెడియన్ ఆలి మధ్య గొడవ గురించి తెలిసిందే. రాజమండ్రి సభలో పవన్ ఆలి గురించి కొన్ని కామెంట్స్ చేశాడు. అతను నా స్నేహితుడైనా సరే వైసిపిలో చేరాడు. అతను చెబితేనే తన చుట్టానికి టికెట్ ఇచ్చానని అన్నారు. అయితే పవన్ చేసిన కామెంట్స్ కు ఆలి కూడా గట్టి కౌంటరే ఇచ్చాడు. మీ అన్నయ్య వేసిన బాటలో నువ్వొచ్చావ్.. కాని నేను కష్టపడి పైకొచ్చా.. నాకు నువ్వు అసలు ఏ సాయం చేయలేదని అన్నాడు.

అయితే ఈ ఇద్దరి వ్యవహారం చూసిన ప్రముఖ సిని దర్శక నిర్మాత పవన్ ఆలిల గొడవపై నా ఆలోచన అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా వెళ్లడించారు. పవన్ నాకు తెలుసు.. ఆలి బాగా తెలుసు.. తనని అన్నయ్యా అన్నయ్యా అంటుంటాడని పవన్, ఆలిల స్నేహం గురించి అందరికి తెలుసని అలాంటి వారు ఇలా రోడ్డు మీద గొడవ పడటం అసలేమాత్రం బాగాలేదని అన్నారు తమ్మారెడ్డి భరద్వాజ్.

పవన్ ఆలిని అలా అనుండాల్సింది కాదు రాజకీయాల్లో కొంత ఓపిక ఉండాలి. ఇక పవన్ గురించి కూడా ఆలి అలా మాట్లాడాల్సింది కాదు అంటూ ఇద్దరి మధ్య జరిగిన గొడవని విశ్లేషించారు తమ్మారెడ్డి భరధ్వాజ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version