BREAKING : తారక తర్నపై హెల్త్ పై కీలక అప్డేట్..విదేశాల నుంచి వైద్యులు !

-

నటుడు నందమూరి వారసుడు తారకరత్న ఇటీవల గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ కుప్పంలో ప్రారంభించిన యువగలం పాదయాత్రలో తారకరత్న పాల్గొని.. కొద్దిసేపు నడవగానే స్పృహ తప్పి పడిపోయారు.

దీంతో పరిస్థితి విషమంగా ఉండడంతో కుప్పం నుండి బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి ఆయనను తరలించారు. ఇక గుండెపోటుకు గురైన నటుడు నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స కొనసాగుతోంది. జనవరి 28న ఆయనను కుప్పం నుంచి ఇక్కడికి తీసుకువచ్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విదేశీ వైద్యులను రప్పించి చికిత్స చేయిస్తున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు రామకృష్ణ వెల్లడించారు. హృద్రోగంతో పాటు, నాడి సమస్యలకు ఆ వైద్యులు చికిత్స చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version