యాంకర్ సుమ సినిమాపై టీడీపి ఎంపీ సంచలన వ్యాఖ్యలు..

-

ప్రముఖ యాంకర్, నటి సుమ నటించిన సినిమా జయమ్మ పంచాయతీ…ఈ చిత్రం ట్రైలర్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విడుదల చేశారు.వేసవి కానుకగా ఈ చిత్రం మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.విజయ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సుమ ప్రధాన పాత్రలో నటిస్తోంది.కీరవాణి సంగీత స్వరాలు సమకూర్చారు.ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ, సెటైర్లు వేస్తూ ఉండే సుమా పవర్ ఫుల్ పాత్రలో పాత్రలో కనిపించనుంది.ఈ చిత్రంలో గ్రామీణ వాతావరణం నేపథ్యంలో రూపు దిద్దుకుంటున్నఈ సినిమా డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి.

తాజాగా జయమ్మ పంచాయితీ సినిమాపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు.ఈ సినిమా ట్రైలర్ బాగుంది అని సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు.శ్రీకాకుళం యాస తో సినిమాలు చూసి నేను గర్వపడుతున్నా మన భాష సంస్కృతి చూపించే ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి అని ఆకాంక్షించారు.కాగా చాలా కాలం తర్వాత సుమ వెండితెరపై ఈ సినిమాతోఈ సినిమా తో రీ ఎంట్రీ ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news