మరో మెడల్ గెలుచుకున్న వేదాంత్ మాధవన్..ఈ సారి బంగారు పతకం

జనరల్‌గా ఏదేని రంగంలో తండ్రి సక్సెస్ అయితే అదే రంగంలోకి తన తనయుడిని కూడా తీసుకొస్తుంటారు. రాజకీయాలు, సినిమాలు, వ్యాపారం ఇలా అన్ని రంగాల్లోనే ఇలానే జరుగుతున్నది. ముఖ్యంగా సినిమాలు..ఉదాహారణకు మెగస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆయన కుటుంబం నుంచి చాలా మంది హీరోలు వచ్చారు. కాగా, కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ మాత్రం అందరిలాగా కాకుండా తన తనయుడిని సినీ రంగంలోకి తీసుకురాలేదు.

తన తనయుడికి ఇష్టమైన స్పోర్ట్స్ ఫీల్డ్ లో ఎంకరేజ్ చేశారు. మాధవన్ తనయుడు వేదాంత్ మాధవన్..16 ఏళ్ల కుర్రాడు.. భారత దేశం తరఫున పలు పోటీల్లో పాల్గొని పతకాలు గెలుచుకున్నారు. డానిష్ ఓపెన్ 2022లో భాగంగా వేదాంత్ మాధవన్ ఆదివారం స్విమ్మింగ్ లో సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. తాజాగా అనగా సోమవారం మరో మోడల్ గెలుచుకున్నాడు.

తన తనయుడు మరో మెడల్ గెలుచుకున్న విషయాన్ని మాధవన్..ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన డానిష్ ఓపెన్ 2022లో వేదాంత్ 800 మీటర్ల ఫ్రీస్టైల్ స్విమ్మింగ్ ఈవెంట్‌లో ఫస్ట్ ప్లేస్ లో నిలిచి గోల్డ్ మెడల్ సాధించాడు.

ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన వీడియోను మాధవన్ ట్వి్ట్టర్ లో షేర్ చేశాడు.ఆదివారం కేవలం 10 మిల్లీ సెకన్ల తేడాతో గోల్డ్ మెడల్ కోల్పోయిన వేదాంత్ మాధవన్ సోమవారం సక్సెస్‌ఫుల్‌గా రేసును కంప్లీట్ చేసి భారత్ తరఫున గోల్డ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు చెప్తున్నారు.