దేవర మూవీకి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..!

-

జూనియర్ ఎన్టీఆర్  ప్రధాన పాత్రలో నటించిన దేవర చిత్రానికి  తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్  చెప్పింది. తెలంగాణ లో దేవర సినిమా టికెట్ల ధరలు పెంచుతూ  సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మిడ్ నైట్ షో కి కేవలం 29 థియేటర్లలో మాత్రమే  అనుమతులు ఇచ్చింది. సినిమా విడుదలైన తొలిరోజు మొత్తం ఆరు షోలకు అనుమతి ఇవ్వడంతో పాటు టికెట్ పై  రూ. 100 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది.

ఈనెల 28వ తేదీ నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు రోజుకు ఐదు షోలు వేసుకునేందుకు ఛాన్స్ ఇచ్చారు. సింగిల్ స్క్రీన్లలో టికెట్ పై  రూ.25, మల్టీప్లెక్స్ లో టికెట్ పై  రూ.50 పెంచుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రభుత్వం అనుమతివ్వగానే హైదరాబాద్ లో బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఎప్పుడూ బుకింగ్స్ ప్రారంభం అవుతాయా..? అని ఎదురు చూసిన అభిమానులకు శుభవార్త అనే చెప్పాలి.  దేవర మూవీలో హీరోయిన్ గా  జాన్వీ కపూర్, విలన్ గా సైఫ్  అలీఖాన్ కీలక పాత్ర పోషించారు. ఈ నెల 27న 1:08 గంటలకు ప్రీమియర్స్ షోతో ప్రేక్షకులు పండుగ చేసుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news