BREAKING: పుష్ప 2కు తెలంగాణ హైకోర్టు లైన్ క్లియర్ చేసింది. అధిక మొత్తంలో టికెట్ ఛార్జీలు వసూలు చేయడాన్ని అడ్డుకోవాలని జర్నలిస్టు సతీష్ కమాల్ పిటిషన్ వేయడం జరిగింది. బెనిఫిట్ షో పేరుతో ₹800 వసూలు చేయడం అన్యాయమని పిటిషనర్ కోర్టుకు వివరించారు. అయితే.. దీనిపై విచారణ చేసిన తెలంగాణ హైకోర్టు..కీలక ఆదేశాలు ఇచ్చింది.
చివరి నిమిషంలో సినిమా రిలీజును ఆపలేమన్న హైకోర్టు… పుష్ప 2కు లైన్ క్లియర్ చేసింది. పూర్తి వివరాలు రెండు వారాల్లో సమర్పించాలని మైత్రి మూవీస్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది తెలంగాణ హై కోర్టు. కాగా, పుష్ప 2 టీంకు చంద్రబాబు సర్కార్ శుభవార్త చెప్పింది. పుష్ప 2 టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతినిచ్చింది ఏపీ ప్రభుత్వం. ఆంధ్రలో కూడా ఒకరోజు ముందే డిసెంబర్ 4 రాత్రి 9:30 గంటలకు పుష్ప ప్రీమియర్ షోస్ ఉండనున్నాయి. ప్రీమియర్ షో టికెట్ రేటు రూ.800 హైక్ చేసింది ఏపీ సర్కార్. డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 17 వరకు మల్టీప్లెక్స్ లో టికెట్ రేట్ కంటే రూ.200 అధికంగా హైక్ చేశారు. సింగిల్ స్క్రీన్స్ అప్పర్ క్లాసుకు రూ.150, లోయర్ క్లాసుకు రూ.100 అధికంగా పెంచుకునేందుకు అనుమతినిచ్చింది ఏపీ ప్రభుత్వం.