శ్రీదేవి సోడా సెంటర్ లో తెలుగమ్మాయికే అవకాశం..

Join Our COmmunity

తెలుగు సినిమాల్లో తెలుగమ్మాయిలు తగ్గిపోతున్న మాట వాస్తవం. ఇక్కడ టాలెంట్ ఉన్నప్పటికీ ముంబై నుండి హీరోయిన్లని తీసుకొస్తుంటారు. ఈ విషయంలో దర్శకుల మీదా, నిర్మాతల మీద చాలా కంప్లైట్స్ వస్తుంటాయి. ఐతే చాలా మంది దర్శకులు తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారన్న విషయం మర్చిపోతున్నారు. అలాంటి వారిలో కరుణ కుమార్ ఒకరు. పలాస 1978 సినిమాతో దర్శకుడిగా తనకంటూ మంచి పేరు తెచ్చుకున్న కరుణ కుమార్, ఆ తర్వాత ఆహా కోసం మెట్రో కథలు తీసాడు.

 

ప్రస్తుతం సుధీర్ బాబు హీరోగా శ్రీదేవి సోడా సెంటర్ సినిమా తెరకెక్కుతుంది. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో సుధీర్ బాబు, ఎలక్ట్రిషియన్ గా కనిపిస్తున్నాడు. ఐతే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో తెలుగమ్మాయికే అవకాశం దక్కింది. ఆనంది అలియాస్ రక్షిత ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైందని తెలుస్తుంది. ఈ రోజుల్లో, బస్ స్టాప్ సినిమాల్లో కనిపించిన ఈ అమ్మడుకి శ్రీదేవి సోడా సెంటర్ లో అవకాశం వచ్చిందని అంటున్నారు. మరి చిత్రబృందం ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి.

TOP STORIES

డేల్యూజనల్ డిజార్డర్ అంటే ఏమిటి.. లక్షణాలు.. కారణాలు.. నయం చేసే వీలు..

చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.. కన్న కూతుళ్ళనే పొట్టన పెట్టుకున్న తల్లితండ్రుల మానసిక వైకల్యం గురించి చర్చ జరుగుతుంది....
manalokam telugu latest news