పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన తలపతి విజయ్ – రష్మిక పాన్ ఇండియా మూవీ..

-

విజయ్ నటించిన “బీస్ట్” మూవీ ఈ నెల13 న విడుదల కానుంది. ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో విజయ్ వీర రాఘవ అనే స్పై క్యారెక్టర్ ను చేస్తున్నాడు.ఒక షాపింగ్ మాల్ ను హైజాక్ చేసిన టెర్రరిస్టుల నుండి ప్రజలను ఎలా కాపాడాలి అనే దానిపై ఈ సినిమా తెరకెక్కించారు. అయితే నేడు విజయ్ 66వ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.

 

ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక కథానాయికగా నటించనుంది.ఈ సినిమాతో విజయ్ తొలిసారి తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం లో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.నిర్మాత దిల్ రాజు పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమా నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది.హీరో హీరోయిన్లు విజయ్, రష్మిక పై దిల్ రాజు క్లాప్ కొట్టి ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news