జగన్ – చిరంజీవి భేటీపై తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిని జగన్ ఎందుకు పిలిచారో నాకు తెలియదని.. ప్రభుత్వం, సినీ సంస్థలతో మాత్రమే చర్చించాలని జగన్ సర్కార్ కు చురకలు అంటించారు. ఏపీ ప్రభుత్వం తన భాద్యత నిర్వర్తించాలని.. చిరంజీవికి అన్ని చెప్పాము. ఏమి అర్థం అయ్యిందో లేదో తెలియదు. ఆయన సీఎంతో ఎం మాట్లాడారో, మొహమాట పడ్డారో తెలియదని అసక్త కర వ్యాఖ్యలు చేశారు.
చిరంజీవిని ఎందుకు విమర్శిస్తున్నారో తెలియదని.. ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళను పిలిచి మాట్లాడాలి. లేదంటే మాట్లాడొద్దన్నారు. ఇండస్ట్రీలో ఐక్యమత్యం ఉండదని.. ఎప్పుడు ఒకటి కాదు అవసరం వచ్చినప్పుడు అందరం ఒక్కటేనని స్పష్టం చేశారు.
కరోనా సమయంలో థియేటర్లకు కరెంటు బిల్లు రెండు రాష్ట్రాలు మినహాయింపు ఇవ్వలేదని.. ఇండస్ట్రీ నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేవు… సినీ పరిశ్రమ కూడా తప్పులు చేసిందని ఫైర్ అయ్యారు. లగ్జరీ విషయంలో కాంప్రమైజ్ కావాలని… రెమ్యునరేషన్ కాంప్రమైజ్ కావాలని అనడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పాజిటివ్ గా ఉన్న పని మాత్రం చేయడం లేదని.. ఇండస్ట్రీ విషయాల కోసం కాకుండా చర్చల్లో సమస్యలు డైవర్ట్ అయ్యిందన్నారు.