ఆ నటుడు నా నడుం పై చేయి వేసి అసభ్యకరంగా కామెంట్లు చేశాడు – కవిత

-

సీనియర్ నటీమణులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న కవిత పలు సినిమాలలో హీరోయిన్ గా నటించి ఆ తర్వాత పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇదిలా ఉండగా ఒక సినిమా షూటింగ్లో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి కీలక వ్యాఖ్యలు చేసిన కవిత.. ఇప్పుడు ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఆమె మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది చాలా ఉంది. అయితే నేను కూడా ఆ బాధను భరించాను.

ముందుగా నేను వారి పేర్లు చెప్పను కానీ ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు.. నా పొట్టపై చేయి పెట్టి కవితకు పొట్ట లేదయ్యా అందుకే సన్నగా కనిపిస్తోంది అని అన్నారు. నేను చాలా ఇరిటేట్ అయిపోయి బాగా తిట్టాను. నన్ను ముట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఏముందని కోప్పడ్డాను. నాకు పెళ్లయి పిల్లలు ఉన్నారు.. ఇక నన్ను ముట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది అంటూ ఆమె ప్రశ్నించింది.రీ ఎంట్రీలో నాకు అంత కోపం వచ్చిందని కవిత కామెంట్లు చేసింది. అంతేకాదు తన అమ్మ లేనప్పుడు తాను చాలా వెధవ పనులు చేశానని చీపురు కట్ట తిరిగేసిన రోజులు కూడా ఉన్నాయని.. 20 ఫీట్స్ నుంచి కిందకి దూకిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చింది.

ఇకపోతే బందిపోటు రుద్రమ్మ సినిమా చేసేటప్పుడు ఒక షాట్ లో ఆమె 20 అడుగుల ఎత్తు నుంచి కిందకి దూకానని.. ఆ సమయంలో తన తల్లి చూసిందని. కేఎస్ రెడ్డి గారు ఫస్ట్ క్లాప్ కొట్టారని ఆమె కామెంట్లు చేశారు. మొత్తానికైతే కవిత చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news