ఎడిట్ నోట్: టీడీపీ క్లోజ్?

-

తెలుగుదేశం పార్టీ కనుమరుగు..ఇదే ఇప్పుడు ఏపీలో జరుగుతున్న చర్చ..ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో వెలుగొందిన టీడీపీ..రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కనుమరుగైంది. కానీ ఏపీలో అధికారంలోకి వచ్చి నిలబడింది. ఇక 2019 ఎన్నికల్లో ఏపీలో కూడా టి‌డి‌పికి భారీ దెబ్బ తగిలింది. దారుణమైన ఓటమిని మూటగట్టుకుని ప్రతిపక్షానికి పరిమియతమైంది. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టి‌డి‌పికి కష్టకాలం మొదలైంది.

ఏదేమైనా జగన్ మాత్రం టి‌డి‌పిని అణిచివేసే దిశగానే రాజకీయం నడిపించారని చెప్పవచ్చు. కానీ ఏదొక విధంగా చంద్రబాబు పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చారు. ఇంకా వైసీపీకి గట్టి పోటీ ఇచ్చే విధంగా రెడీ చేశారు. ఇలాంటి సమయంలో బాబు అరెస్ట్ కావడంతో టి‌డి‌పిలో సంక్షోభం మొదలైందని చెప్పవచ్చు. మామూలుగా బాబు బయట ఉంటే నిత్యం ఏదొక అంశంలో వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉంటారు. అటు ప్రజల్లో తిరుగుతూ..రోడ్ షోలు, సభలు నిర్వహిస్తారు. ఇటు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. ఇక లోకేష్ దూకుడుగా పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నారు.

ఇలా టి‌డి‌పి దూకుడుగా ముందుకెళుతున్న సమయంలో బాబు అరెస్ట్ అయ్యారు. ఈ దెబ్బతో మొత్తం వెనక్కి వెళ్ళాయి. కేవలం బాబు అరెస్ట్ చుట్టూనే చర్చ నడుస్తోంది. ప్రజా సమస్యలు పక్కకు వెళ్ళాయి. బాబు అరెస్ట్ వల్ల తెలుగు తమ్ముళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతింది. ఇంకా బాబు గాని కొన్ని రోజులు జైల్లో ఉంటే టి‌డి‌పి పరిస్తితి మరింత దిగజారుతుంది.

ఒకవేళ లోకేష్ కూడా అరెస్ట్ అయితే ఇంకా టి‌డి‌పి కథ సమాప్తం అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వారిద్దరు అరెస్ట్ అయితే పార్టీని నడిపించే వారు ఉండరు. దీంతో కార్యకర్తలు చెల్లాచెదురు అవుతారు. నాయకులు తమ దారి తాము చూసుకుంటారు. ఈ పరిణామాలు రాకుండా చూసుకుంటే మంచిదే..కానీ అదే జరిగితే ఇంకా టి‌డి‌పి కథ ముగిసినట్లే. ఎన్నికల సమయంలో టి‌డి‌పి భారీగా దెబ్బతినడం ఖాయం.

Read more RELATED
Recommended to you

Latest news