పుష్ప నటుడు ఫహద్ ఫాసిల్ పై కేసు.. ఆ సినిమానే కారణమా..?

-

ఇప్పుడిప్పుడే తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు మలయాళీ హీరో ఫహాద్ ఫాజిల్. డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప ఫస్ట్ పార్టులో విలన్ పాత్రతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాలో ఫహాద్ కనిపించింది కొద్ది సమయమే అయినా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు భారీ అంచనాల మధ్య రూపొందుతున్న పుష్ప 2 చిత్రంలో ఫహద్ ఫాజిల్ రోల్ ప్రధానంగా ఉండబోతుంది. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది.

తాజాగా ఫహాద్ చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. అతడిపై కేరళ మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు.. అతడిపై సుమోటోగా కేసు కూడా నమోదయింది. ఫహాద్ ఫాజిల్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటున్నాడు. ఇటీవలే ఆవేశం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రానికి తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓవైపు హీరోగా, విలన్ గా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఫహాద్.. ఇప్పుడు నిర్మాతగానూ మారాడు. ప్రస్తుతం పింకేలీ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news