కొండగట్టు యాత్రలో ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్లిన జనసేన అధినేత ,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.శామీర్ పేటలోని, తుర్కపల్లిలో అభిమానులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తెలంగాణ రాజకీయాల్లో సైతం జనసేన యాక్టివ్ గా ఉంటుoదన్నారు. ఇప్పటికే ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కారు నడుస్తోందని,రానున్న ఐదేళ్లలో ఏపీ అన్నివిధాలుగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. తెలంగాణలోను బీజీపీతో కలిపి పనిచేస్తామంటూ పవన్ వ్యాఖ్యలు చేయగా ఒక్కసారిగా రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో 8 స్థానాల్లో బీజేపీతో కలిసి బరిలోకి దిగిన జనసేనకు ఓటమి ఎదురైంది.కానీ బీజేపీ మాత్రం 8 సీట్లను గెలుచుకుంది.తాజాగా 2024 లో జరిగిన ఎంపీ ఎన్నికలలో తెలంగాణాలో 8 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. అంతే కాకుండా..వచ్చే ఎన్నికలలో ఆ స్థానాలను 88 లేదా అంతకన్న ఎక్కువ స్థానాలు గెలుచుకునే విధంగా ప్రణాళికలు రచిస్తోంది.పవన్ వ్యాఖ్యలను బట్టి చూస్తే రానున్న రోజుల్లో తెలంగాణలోనూ ఏపీ తరహా ఫలితాలు సాధించేలా కనిపిస్తున్నారు.తెలంగాణపై ఇప్పటికే బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది.ఇక పవన్ కూడా కలిసి వస్తే ప్రభంజనం తప్పదని అక్కడి బీజేపీ నేతలు అంటున్నారు.
ఎంపీలు బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు కేంద్రంలో కీలక శాఖలను కేటాయించింది బీజేపీ. ఈ నేపథ్యంలో తాజాగా, పవన్ కళ్యాణ్, బీజేపీతో కలిసి పనిచేస్తామంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మరోవైపు పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ నేతలు ఎవరు కూడా స్పందించలేదు.అయితే ఏపీలో టీడీపీతో జతకట్టిన పవన్ తెలంగాణ టీడీపీ గురించి పవన్ ఎలాంటి కామెంట్లు చేయకపోవడం గమనార్హం.తెలంగాణలో త్వరలో గ్రేటర్ తోపాటు, పంచాయతీ ఎన్నికల జరుగనున్నాయి. ఈ క్రమంలో బీజేపీతో కలిసి, జనసేన బరిలో ఉంటుందా అనే దానిపై ఇప్పుడు చర్చనడుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ బలహీనపడుతున్న వేళ..ఎలాగైనా బీజేపీ పుంజుకుని బలపడాలని పావులు కదుపుతుంది.అయితే ఏపీ మాదిరిగా మూడు పార్టీలు అక్కడ కూడా కలుస్తాయా లేక కేవలం జనసేన, బీజేపీ మాత్రమే పొత్తులో ఉంటాయా అనేది త్వరలోనే తేలబోతుంది.