“మా” లో మ‌ళ్లీ మొద‌లైన ర‌చ్చ

మూవీ ఆర్టీస్ట్ అసోసియేషన్ లో గొడ‌వ‌లు మ‌ళ్లీ మొద‌లు అయ్యాయి. ఇటీవ‌ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ కు జ‌రిగిన ఎన్నిక‌ల త‌ర్వాత నుంచి మా కార్యాల‌యం అస‌లు ఓపెన్ చేయా లేద‌ని న‌టీ న‌టులు ఆందోళ‌న చేశారు. మా ఎన్నికలు జరిగి.. కొత్త పానెల్ బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యాల‌యం తీయ‌డం లేద‌ని ప‌లువురు నటీనటులు అంటున్నారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ప్రారంభం అయిన నాటి నుంచి ఇలాంటి సంద‌ర్భం ఎనాడూ కూడా జ‌ర‌గ‌లేద‌ని ప్రకాష్ రాజ్ ప్యాన‌ల్ వర్గం నటీ న‌టులు అంటున్నారు. మా కార్యాల‌యా ని కి ఎప్పుడు వెళ్లిన కార్యాల‌యం మూసి ఉంటుంద‌ని న‌టీన‌టులు చెబుతున్నారు. కాగ ఇటీవ‌ల జ‌రిగిన మా ఎన్నిక‌ల్లో ప్రకాశ్ రాజ్ ప్యానల్ స‌భ్య‌లుకు, మంచు విష్ణు ప్యాన‌ల్ స‌భ్య‌లుకు మ‌ధ్య త‌ర‌చూ వివాదం జ‌రిగిన విష‌యం తెలిసిందే. కాని గ‌త కొద్ది రోజుల నుంచి ఈ రెండు వ‌ర్గాల న‌టీ న‌టులు సైలెంట్ గా ఉన్నారు. కానీ తాజా గా కార్యాల‌యం విష‌యం లో రెండు వ‌ర్గాల మ‌ధ్య మ‌ళ్లీ ర‌చ్చ మొద‌లు అయింది.