తెలుగు సినీ నిర్మాత కేదార్ శెలగం శెట్టి దుబాయ్ లోని తన ప్లాట్ లో అనుమానస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. ప్రతిదానిని సోషల్ మీడియాలో పెట్టే హరీశ్ రావు దుబాయ్ పర్యటన వివరాలు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. నీదోస్తు బిడ్డ పెల్లి 6వ తేదీన ఉంది. మరి 6వ తేదీ పెళ్లి ఉంటే నువ్వు 22 తేదీన ఎందుకు పోయినట్టు అని ప్రశ్నించారు.
ఎవ్వని బ్యాండ్ కొట్టనీకి పోయినవ్.. రీల్స్ కూడా చూపియ్యలే.. అని తీవ్ర విమర్శలు చేశారు. హరీశ్ రావు దుబాయ్ పోయిన రోజే కేదార్ చనిపోయారని సంచలన ఆరోపణలు చేశారు. హరీశ్ రావుకి శవరాజకీయాలు కొత్త కాదని మండిపడ్డారు. కేదార్ మరణం పై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు ఎంపీ చామల.