వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అందిస్తూ మంచి ప్రేక్షకాదరణ పొందుతుంది.. అంతే స్థాయిలో టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతోంది మొదటిసారి ఓటీటీ వేదికగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో బిగ్ బాస్ నాన్ స్టాప్ తెలుగు సీజన్ వన్ రియాల్టీ షో ఫిబ్రవరి 26వ తేదీ నుంచి ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే. ఆ రోజు నుంచి నేటివరకు నాన్ స్టాప్ షోకి విన్నర్ ఎవరు అనేది సోషల్ మీడియాలో ప్రతిరోజు హాట్ టాపిక్ గా మారుతూ వచ్చింది. తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న అంచనాల ప్రకారం మొట్టమొదటిసారిగా ఆడపులి బిందు మాధవి టైటిల్ విన్నర్ గా నిలిచిన ట్లు సమాచారం.
ఇక టాస్క్ లో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వకపోయినప్పటికి తన మాట తీరుతో నామినేషన్స్ లో తనదైన మార్క్ ను క్రియేట్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. కొంతమందిలో ఒంటరిగా పోరాటం చేసి విమర్శలను, సవాళ్లను ఎదుర్కోవడంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఆడియన్స్కి చూపించింది. తన బెస్ట్ ఫ్రెండ్ అయినా శివ తప్పు చేస్తే నామినేట్ చేసిన తీరు బిగ్బాస్ ప్రేక్షకులను ఆలోచింపజేసేలా చేసింది. అంతే కాదు శత్రువులు ఎక్కువ అవుతున్నా ఎక్కడా తొణకలేదు అని చెప్పవచ్చు. ఇక ఎన్ని విమర్శలు వచ్చినా కృషి పట్టుదల ఉంటే విజయం సొంతం అవుతుంది అని బిందు మాధవి చేసి చూపించినందుకు ఆడియన్స్ ఈమెకు ఫిదా అవుతున్నారు.