అసెంబ్లీ ముట్టడికి యత్నించిన మాల సంఘాల నేతలు అరెస్ట్..!

-

ఎస్సీ వర్గీకరణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మద్దతు ఇవ్వడం పై మాల సంఘాల నాయకులు అసెంబ్లీ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే మాల నాయకులు ఇవాళ సీఎం డౌన్ డౌన్ అంటూ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. అసెంబ్లీ ముందు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు మాల మహానాడు నాయకులు చెన్నయ్య, రామచందర్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు.

ఎస్సీ వర్గీకరణకు సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తే.. సహించేది లేదని ఈ సందర్భంగా మాల మహానాడు నాయకులు హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో ప్రత్యేక చట్టం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ అంశం పై మాల సంఘాలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మాల సంఘాల నాయకులను ముందస్తుగా అరెస్టులు చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news