జానీ మాస్టర్ కి మరో షాక్ తగిలింది. జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని కోరారు పోలీసులు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన పోలీసులు…జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని కోరారు. నేషనల్ అవార్డు తీసుకునేందుకు బెయిల్ మంజూరు చేయాలని కోరాడు జానీ మాస్టర్..దీంతో ఈ నెల 6 నుంచి 10 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు.
కానీ జానీ కి ప్రకటించిన నేషనల్ అవార్డు ను క్యాన్సల్ చేస్తున్నట్లు ప్రకటించింది అవార్డు కమిటీ. ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నాడు జానీ మాస్టర్. ఇలాంటి తరుణంలోనే.. జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని కోరారు పోలీసులు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు పోలీసులు. మరి దీనిపై రంగారెడ్డి జిల్లా కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.