‘దేవ‌ర’ సెకండ్ సింగిల్.. రొమాంటిక్ ట్రీట్ మామూలుగా లేదుగా..!

-

ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా  ఎదురు చూస్తున్న దేవర సెకండ్ సింగ్ సాంగ్ ఎట్టకేలకు విడుదల అయింది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, జాన్వీకపూర్ లు ఈ సాంగ్ లో పూర్తిగా రొమాంటిక్ మూడ్ లోకి తీసుకెళ్లారు. తొలిసాంగ్ విధ్వంసాన్ని చూపిస్తే.. చుట్టమల్లె అంటూ వచ్చిన రెండో సాంగ్ రొమాన్స్ ని పరిచయం చేసింది.

ఈ సాంగ్ కి లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రీ అద్భుతమైన లిరిక్స్ అందించారు. అలాగే అనిరుధ్ రవిచందర్ సూపర్ మ్యూజిక్ ఇచ్చాడు. సింగర్ శిల్పారావు ఈ సాంగ్ చాలా అద్భుతంగా పాడారు. ఈ పాట రికార్డులను తిరగరాయడం ఖాయమని తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో జాన్వీకపూర్ అందాలు అభిమానులకు అదిరిపోయే ట్రీట్ అనే చెప్పాలి. ఈ మూవీలో ఎన్టీఆర్, జాన్వీ ల మద్య కెమిస్ట్రీ నెక్ట్స్ లెవెల్ ఉండబోతున్నట్టు ఈ సాంగ్ లో స్పష్టంగా అర్థమవుతోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న దేవర మూవీ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version