డాకు మహారాజ్ ట్రైలర్ వచ్చేసింది.. ఫ్యాన్స్ కి పూనకాలే..!

-

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా కొల్లి బాబీ(కే.ఎస్.రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ డాకు మహారాజ్. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలు. బాబీ డియోల్, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ప్రమోషన్లలో చిత్ర యూనిట్ చాలా బిజీగా గడుపుతోంది. 

తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదల అయింది. అనగనగా ఒక రాజు ఉండేవాడు. చెడ్డ వాళ్లంతా ఆయనను డాకు అనే వాళ్లు. నాకు మాత్రం మహారాజు. అనే కథతో ప్రారంభమైంది. నీకు నువ్వే జీ అని పెట్టుకుంటే నీకు రెస్పెక్ట్ ఇవ్వాలా..? చెప్పింది వినాలి.. ఇచ్చింది తీసుకోవాలి. అనే డైలాగ్ లు ఆకట్టుకున్నాయి. యాక్షన్స్ అదుర్స్ అనిపించాయి. ఈ అడవిలో పులీ, ఎలుగుబంటో వస్తే ఎలా..? అంటే కింగ్ ఆఫ్ జంగిల్ ఉన్నాడమ్మ అంటూ పాప చెప్పే డైలాగ్ సినిమాకే హైలెట్ గా నిలిచిందని ఈ ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news