బాలీవుడ్ నటుడి ఆఫీసులో చోరీ.. సినిమా నెగిటివ్ ఎత్తుకెళ్లిన దొంగలు

-

బాలీవుడ్ స్టార, కార్తికేయ మూవీ నటుడు అనుపమ్ ఖేర్ ఆఫీస్​లో తాజాగా చోరీకి పాల్పడ్డారు. డబ్బులను దాచే సేఫ్​ లాకర్​తో పాటు ఓ మూవీ నెగెటివ్​ను ఎత్తుకెళ్లారు. ఈ విషయాన్ని అనుపమ్ ఖేర్ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు.

ముంబయిలోని వీర దేశాయ్ రోడ్‌లోని అనుపమ్​ ఖేర్ ఆఫీస్​లో ఎవ్వరూ లేని సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి  అక్కడే ఉన్న లాకర్​తో పాటు ఓ ఫిల్మ్​ నెగిటివ్​ను ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత అక్కడ నుంచి ఓ ఆటోలో పరారయ్యారు. ఇదంతా ఆఫీస్ బయట ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.  అనుపమ్ ఖేర్ ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారు  దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా దొంగలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.  ఈ విషయాలన్నింటినీ అనుపమ్​ ఖేర్ ఓ వీడియో ద్వారా సోషల్ మీడియాలో తెలిపారు. త్వరలోనే ఆ దొంగల్ని పట్టుకుంటామంటూ తెలిపిన ఆయన, తన వద్గ ఆటో నంబర్ కూడా ఉందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news