హుటాహుటిన సిరిసిల్లాకు కేటీఆర్ వెళుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఈరోజు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళుతున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం పదిరలో అంబేద్కర్ విగ్రహా విష్కరణ కార్యక్రమం ఉంది. ఇందులో కేటీఆర్ పాల్గొంటారు.
అలాగే.. ఇవాళ ఉదయం 11.30 గంటలకు సిరిసిల్ల పద్మశాలి సంఘం కళ్యాణ మండపంలో ఇటీవల ఎన్నికైన అర్బన్ బ్యాంకు పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు కేటీఆర్. ఈ తరుణంలోనే… సిరిసిల్లా బీఆర్‌ఎస్ పార్టీ నేతలు.. కేటీఆర్ ఘనంగా స్వాగతం పలుకనున్నారు.
కాగా, సింగరేణిని ఖతం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ చూస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సింగరేణిని కాపాడేందుకే కేసీఆర్ బొగ్గు గనుల వేలంలో పాల్గొనలేదని తెలిపారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కొత్త ప్రాజెక్టు తేవాల్సింది పోయి.. ఉన్నవాటినే అమ్ముతున్నారని విమర్శించారు. బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చినందుకు మీరిచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదా? అంటూ ప్రశ్నించారు. 16 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రంలో నిర్ణయాత్మకంగా ఉంటాం అని కేసీఆర్ అన్నారని.. 16 ఎంపీ సీట్లతో ఏం చేస్తారని సీఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారని ధ్వజమెత్తారు.